Crime శ్రద్ధ వాకర్ దారుణాన్ని మరువకముందే అలాంటి ఓ షాకింగ్ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది ఓ నేవి ఉద్యోగిని హత్య చేసి ముక్కలుగా కోసి విసిరేసిన వైనం అందరినీ షాక్ కి గురి చేసింది..
పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది రిటైర్ అయిన ఓ నేవీ ఉద్యోగిని ఆయన భార్య కొడుకు దారుణంగా హత్య చేశారు.. ఆయన మృతదేహాన్ని ఆరు ముక్కలుగా కోసి వేరువేరు ప్రాంతాల్లో విసిరేశారు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లతో పాటు పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు.. వివరాల్లోకి వెళ్తే
హత్యకు గురైన వ్యక్తి ఉజ్జల్ చక్రవర్తి (54)గా గుర్తించారు. బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్ నివాసి. గతంలో నేవీలో పనిచేసిన ఈయన 2000 సంవత్సరంలో పదవి విరమణ చేసినట్టు తెలుస్తోంది అయితే ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ గా కూడా పనిచేస్తున్నారని సమాచారం ఈయనను నవంబర్ 14వ తేదీన ఆయన భార్య కొడుకు దారుణంగా హత్య చేశారు అంతేకాకుండా శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసి ఎవరికంట పడకుండా పారేశారు ఈ విషయం బయటకు రాకుండా ఆయన అదృశ్యమైనట్టు తెలివిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు.. ఆయన ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేసేవాడని అలాగే నవంబర్ 14వ తేదీన కూడా గొడవ జరగడంతో ఆయన్ను కిందకు నెట్టేసి గొంతు కోసి హత్య చేశారని తెలుస్తోంది అయితే మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లేందుకు ఆరు ముక్కలుగా చేసి హైవే సమీపంలో పడేసారని సమాచారం..