సైబరాబాద్ కమిషనరేట్ లో శుక్రవారం smart vision eye hospital, గచ్చిబౌలి వారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అందరికి ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వయించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 327 మంది పోలీసు సిబ్బంది మరియు అధికారులకి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం ఈరోజు మరియు రేపు అనగా 24.06.2022, 25-06-2022 నాడు ఉదయం 9:30 గంటలనుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోగలరని కమీషనర్ గారు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో smart vision eye hispital, గచ్చిబౌలికి సంబందించిన Dr. Abida Fatima, కంటి వైద్య నిపుణురాలు, Prem, Naresh,Sreekanth, Navya వారి బృందం మరియు Medicover hospital నుండి SriHari, Rachel, Jhuma sarkar బృందం వారి వైద్య సేవలు అందించడం జరిగింది. మరియు వీరితో పాటు CAR Addl.D.C.P శ్రీ రియాజ్ ఉల్ హాక్, RI. అరుణ్ kumar, unit hospital డాక్టర్స్ Dr. సరిత మరియు Dr. సుకుమార్ గార్లు పాల్గొన్నారు.