Free Food for Corona Patients, Telangana Police News, Covid News, Corona News, Corona Updates,
TELANGANA POLICE: కరోనా బాధితులకు ఉచిత “సేవా భోజనం”: తెలంగాణ పోలీసు శాఖ
ప్రస్తుతం దేశంలో కరోనా 2nd Wave విలయ తాండవం చేస్తుంది, ప్రజల్ని భయ భ్రాంతులను చేస్తుంది, చాల మరణాలు సంభవిస్తున్నాయి, ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేక పోతున్నాయి ప్రభుత్వాలు, తెలంగాణాలో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో కరోనా బాధితులకు తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనుంది. సత్యసాయి సేవా సంస్థ, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి ‘సేవా భోజనం’ పేరిట పథకాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన వారు ఉదయం ఏడు గంటల్లోగా 77996-16163 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పోలీసు శాఖ తెలిపింది.