Garuda Ram’s Look In Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Released, Film News, Telugu World Now,
శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలనచిత్రం `భళా తందనాన` చిత్రంలో గరుడరామ్ లుక్ విడుదల
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది నటులు మాత్రమే అసాధారణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ విభిన్న కథా చిత్రాలలో నటిస్తుంటారు వారిలో శ్రీవిష్ణు ఒకరు. ప్రస్తుతం బాణం ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం `భళా తందనాన`.
ఈ చిత్రంలో శ్రీ విష్ణుని ఇంతవరకూ చూడని ఒక సరికొత్త అవతారంలో ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు చైతన్య.
ప్రముఖ నిర్మాణసంస్థ వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ మెయిన్‌విలన్‌గా నటిస్తున్నారు.
ఈ రోజు గరుడరామ్ పుట్టినరోజు సందర్భంగా అతని లుక్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ మూవీలో ఆనంద్‌బాలి అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అతని లుక్, క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ మరియు టైమింగ్ అన్నీ ఈ సినిమాలో భిన్నంగా ఉండబోతున్నాయి అని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో అతను పొడవాటి జుట్టు మరియు గుబురైన గడ్డంతో పర్‌ఫెక్ట్ మెయిన్ విలన్ ని తలపిస్తున్నాడు.
ఐదు పాటలు ఉన్న ఈ చిత్రానికి మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్, శ్రీకాంత్ విస్సా రైటర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్.
ప్రస్తుతం భళా తందనాన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
తారాగణం: శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్రరాజు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత – రజని కొర్రపాటి
సమర్పణ – సాయి కొర్రపాటి
బ్యానర్ – వారాహి చలనచిత్రం
సంగీతం – మణిశర్మ
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
డిఓపి – సురేష్ రగతు
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
రైటర్ – శ్రీ కాంత్ విస్సా
వారాహి టీమ్ – భాను ప్రకాశ్ బాబీ చిగురుపాటి
పిఆర్ఓ- వంశీ – శేఖర్