ఓ ప్రముఖ దినపత్రిక లో వచ్చిన అక్కకోసం తమ్ముడు తల్లడిల్లే అనే ఆర్టికల్ పై స్పందించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
మహారాష్ట్ర కు చెందిన పాండురంగ కరాడే తన సోదరి ఇందుబాయ్ నోటి కేన్సర్ చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ బసవతారకం హాస్పిటల్ కు తీసుకురాగ ప్రతి5 రోజులకు ఒకసారి రావాలి అని డాక్టర్స్ కోరగా నాందేడ్ నుండి రావడం కష్టమని దారి ఖర్చులకు కూడా డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి సమీపంలో చెట్టు కింద ఆశ్రయం పొంది ఆమెకు ద్రవాహారం పైపు ద్వారా అందిస్తున్నాడు. కూలి నాలి చేసుకొని బతికే తనకు గది అద్దెకు తీసుకునే స్తోమత లేదని పాండు రంగా కరాడే పత్రిక వారికి చెప్పారు
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు స్పందించి అతని వద్దకు స్వయం గా వెళ్లి ఖర్చులకు కొంత సమకూర్చి హాస్పిటల్ డైరెక్టర్ టీ ఎస్ రావు గారితో మాట్లాడి అతనికి ఆసుపత్రి లో ఉచితంగా ట్రీట్మెంట్ మరియు ఉచితంగా గది ఇప్పించాలని కోరారు వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించి వారికి ఉచిత గది ఏర్పాటు చేసారు. మేయర్ గారు బసవతారకం హాస్పిటల్ ను సందర్శించి వారి సేవలను అభినందించరు.