Gopichand Malineni : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించారు. తమన్ సంగీతంలో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. బాలయ్య ఊరమాస్ పర్ఫామెన్స్ తో అలరించడంతో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అదిరిపోయే హిట్ గా నిలిచింది.
కాగా ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా దర్శకుడు గోపిచంద్ ఈ సినిమా గురించిన కొన్ని విషయాలు రివీల్ చేసారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్రను పరిటాల రవి స్ఫూర్తితోనే తీర్చిదిద్దినట్లు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపరిచారు. అలానే గోపిచంద్ మాట్లాడుతూ…. పరిటాల రవి గురించి తాను విన్నది, చదివింది ఉంచుకుని ఆ పాత్రను రూపొందించినట్లు వివరించాడు. ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తిగా పరిటాల రవిని దృష్టిలో ఉంచుకునే చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘పరిటాల రవికి ప్రమాదం ఉందని ఓ పేపర్‌లో చదివాను. ఆయనను కొంతమంది ఎన్ఆర్ఐలు యూఎస్ రమ్మన్నారు.
అయితే తాను పుట్టింది ఇక్కడే.. కాబట్టి చనిపోయినా ఇక్కడే అని పరిటాల వద్దన్నారని ఆ పేపర్ ఉంది’ అని గోపీచంద్ మలినేని అన్నారు.రాయలసీమలో పరిటాల రవికి ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే వీరసింహారెడ్డి పాత్రను కూడా తీర్చిదిద్దామని.. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం గోపిచంద్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.