గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో నవీన్‌కుమార్ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్ గట్టు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం ట్రైలర్ విడుదల, ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర యూనిట్, ఇతర ఆహ్వానితులు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రజనీ సాయిచంద్, భోలే షావలి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రaాన్సీరాజేందర్‌రెడ్డి, మెట్టపల్లి సురేందర్, తురుమ్‌ఖాన్ దర్శకుడు శివ, మౌనశ్రీ మల్లిక్, జబర్‌దస్త్ నటులు, జీవన్, వెంకీ, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
నటీనటులు : నవీన్ కుమార్ గట్టు, లయ, వరంగల్ బాషన్న, ఆనంద్ భారతి, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ మీల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్, మేరుగు మల్లేశం గౌడ్, కళ్యాణ్ మేజిషియన్ మానుకోట ప్రసాద్, కృష్ణ వేణీ, ఉదయశ్రీ ,రజీయ, ఉషా, సకేత, రాజేష్, సుదర్శన్, నరేందర్, దయ, భరత్ కామరాజు, ప్రసాద్, ప్రశాంత్, అఖిల్ (బంటి)
సాంకేతిక నిపుణులు : సంగీతం: మల్లిక్ ఎం.వి.కె., కెమెరా: మస్తాన్ సిరిపాటి, ఎడిటింగ్: యాదగిరి కంజర్ల, డి.ఐ: రాజు సిందం. పాటలు: మౌనశ్రీ మల్లిక్,గిద్దె రాం నర్సయ్య,కిరణ్ రాజ్ ధర్మారాపు,అద్వ్కెత్ రాజ్,రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల, పి.ఆర్.ఓ: ఆర్.కె.చౌదరి, సహకారం: టి. గణపతిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌కుమార్ గట్టు.