యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘పరేషాన్. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి కల్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సక్సెస్ మీట్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అమ్మ, స్నేహితులతో కలిసి పరేషాన్ సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. కేరాఫ్ కంచరపాలెం, సినిమా బండి, బలగం చిత్రాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే పరేషాన్ చూసినప్పుడు కలిగింది. సినిమా చూసినప్పుడు మనల్ని మనం మర్చిపొతే అదే మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ పరేషాన్ లో జరిగింది.
ప్రతి పాత్రతో కనెక్ట్ అయ్యాను. నేను వరంగంలో వుండే రోజులు గుర్తుకు వచ్చాయి. తిరువీర్ తో పాటు అందరూ ఎంతో సహజంగా నటించారు. ప్రతి పాత్ర గుర్తుండి పోతుంది. సినిమా పట్ల ప్యాషన్, ప్రేమతో చేసిన చిత్రమిది. ఒక సినిమా చూసి ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇది మన కథ అని ఫీలై, ఆ పాత్రలతో కనెక్ట్ ఐతే అదే సినిమాకి వచ్చిన గొప్ప గౌరవం. అలాంటి గౌరవాన్ని తెచ్చుకునే సినిమా పరేషాన్. దర్శకుడు రూపక్ కి యూనిక్ స్టైల్ వుంది. చాలా నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో తీసిన సినిమా ఇది. చూస్తున్నపుడు ఆ ఫ్రెష్ నెస్ కనిపించిది” అన్నారు.