Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , శ్రీలీల , మీనాక్షి చౌదరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అనేక కారణాలు వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈక్రమంలోనే ఈ ఆగష్టులో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ అయ్యింది.
అయితే ఇంతలో చిత్ర యూనిట్ నుంచి ఒక్కొక్కరిగా అందరూ బయటకి వెళ్లిపోతుండడం, షూటింగ్ మళ్ళీ లేట్ అవుతుండడంతో సంక్రాంతికి కూడా కష్టమే అని వార్తలు వినిపించాయి. మీడియా వర్గాల్లో ఈ పోస్ట్‌పోన్ పై అనేక వార్తలు వస్తున్నప్పటికీ, అభిమానులు ఆందోళన చెందుతున్నా.. మూవీ టీం మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. తాజాగా వీటన్నిటికీ మహేష్ బాబు చెక్ పెట్టేశాడు.
ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సి 20 ఇయర్స్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు గుంటూరు కారం గురించి మాట్లాడుతూ.. సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. జనవరి 12 డేట్ లో ఎటువంటి చేంజ్ లేదు అంటూ కుండబద్దలుకొట్టేశాడు. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సంక్రాంతి భారీలో గుంటూరు కారం ఘాటు బాక్స్ ఆఫీస్ కి ఏ రేంజ్ లో తగలనుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో మహేష్ పక్కా మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల తమిళ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మహేష్ బాబు క్లాస్ రోల్స్ లో కనిపించాడు. మాస్ రోల్స్ చేసినా వాటిలో కొంత క్లాస్ టచ్ ఉండేది. కానీ గుంటూరు కారంలో మాత్రం పూర్తీ మాస్ పాత్రలో మహేష్ కనిపించి ఆడియన్స్ కి మంచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాడని సినిమా పై అంచనాలు మరింత పెంచేశాడు.