Health ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు మనకు ఎంత శక్తినిస్తాయో…. వాటిని సరైన సమయంలో, సరైన రీతిలో తీసుకోకుంటే అదే తీరుగా అనారోగ్యాన్ని కలిగిస్తుంటాయి. అందుకే…ఇంట్లోని పెద్దలు చాలా పదార్థాల్ని కలిపి తీసుకోవద్దని చెబుతుంటారు. కాదని.. వాటిని ఆహారంలో ఒకేసారి కలిపి తీసుకుంటే… తీవ్రమైన ఉదర సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు… ఆయుర్వేద నిపుణులు. కొంత మందిలో అయితే ఫుడ్ పాయిజన్‌కు కూడా దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. మరి ఆ పదార్థాలు ఏంటో… మనకూ తెలుసుకుందాం.
పాలు, అరటి… రెండింటిలోనూ మంచి పోషకాలు ఉంటాయి. వీటిని విడివిడిగా తీసుకోవడం వల్ల మంచి శక్తిని పొందొచ్చు. కానీ…రెంటినీ కలిపి తీసుకుంటే మాత్రం దగ్గు, జలుబు సహా… అలర్జీలను కలిగించే ప్రమాదకర టాక్సిన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయంటున్నారు… నిపుణులు. అదే అరటి పండు పుల్లగా ఉండి, పాలల్లో చక్కెర వంటివి కలపడం వల్ల తీయగా ఉన్నప్పుడు తింటే జీర్ణవ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
నెయ్యి- పెరుగు.. పాలు, అరటి… రెండింటిలోనూ మంచి పోషకాలు ఉంటాయి. వీటిని విడివిడిగా తీసుకోవడం వల్ల మంచి శక్తిని పొందొచ్చు. కానీ…రెంటినీ కలిపి తీసుకుంటే మాత్రం దగ్గు, జలుబు సహా… అలర్జీలను కలిగించే ప్రమాదకర టాక్సిన్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయంటున్నారు… నిపుణులు. అదే అరటి పండు పుల్లగా ఉండి, పాలల్లో చక్కెర వంటివి కలపడం వల్ల తీయగా ఉన్నప్పుడు తింటే జీర్ణవ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. నెయ్యి, పెరుగును కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే.. గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యల్ని ఆహ్వానించినట్లే అంటున్నారు. అదే… ఈ రెండింటినీ విడివిడిగా తీసుకుంటే మాత్రం బోలెడు ప్రయోజనాలున్నాయంటున్నారు.
పండ్ల విషయానికి వస్తే… అత్యధిక శాతం నీటిని కలిగి ఉండే పుచ్చకాయను ఇతర పండ్లతో కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు… నిపుణులు. ముఖ్యంగా యాపిల్ వంటి పండ్లతో కలిపి తింటే జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయంటున్నారు.