Health Tips: తాత ముత్తావ్వల నుండి ఇప్పటివరకు కూడా వేప చెట్టు ఉపయోగాలు చెపుతూ ఉంటారు. అనేకమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్లలో వేప చెట్టు అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట వేప చెట్లను పెంచుకుంటూ ఉండేవారు మారుతున్న ఆధునిక సంప్రదాయాల వలన వేప చెట్లు అధికంగా తగ్గుతున్నాయి అని చెప్పుకోవాలి. వేప చెట్టును నుండి వచ్చే పువ్వు నుండి వేరే వరకు అనేక వ్యాధి రోగ చికిత్సకు చక్కటి మూలికగా కూడా చెప్పుకోవచ్చు. మరి వేప చెట్టు నుండి వచ్చే చక్కటి ఉపయోగాలు తెలుసుకోండి మరి…
ప్రస్తుత వర్షాకాలం అనేక చర్మవ్యాధులు విష జ్వరాలు అధికంగా వస్తూ ఉంటాయి. అయితే ముందస్తుగా వేపాకు ద్వారా ఉపశమనం పొందవచ్చు వేపాకులో ఉండే అనామ్లజనకాలు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. వర్షాకాలంలో దుస్తులు సరిగా అరకపోవడంతో బ్యాక్టీరియా అధికమై దురద, దద్దుర్లు, వంటి సమస్యలు చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వేపాకు ద్వారా ఉపశమనం పొందవచ్చు. మనం స్నానం చేసే ముందు వేపాకులను వేటి నీటితో పాటు మరిగించాలి ఆ నీటితో స్నానం చేయడం వల్లన దురద ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.వేపలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి క్రమం తప్పకుండా వేపాకు తీసుకోవడం వల్ల రక్తానికి శుద్ధి , మొటిమలు మొదలైన అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. వేప ఆకులను పరకడుపున తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగులు, అసిడిటీ, ఆకలి లేకపోవడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.విష జ్వరాలతో బాధపడేవారు ఉదయాన్నే వేప పుల్లతో నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.