Health Tips:ఉసిరిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అడవి ఉసిరి ఇంకొకటి నెల ఉసిరి. అడవి ఉసిరి లో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇది చర్మ రోగాలు వంటి సమస్యలను మటుమాయం చేయడంలో ఎంతగానో పనిచేస్తుందని ఆయుర్వేదంలో తెలుపుతూ ఉంటారు. అయితే ఉసిరిని రోజు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం చేసుకోవచ్చు. ఉసిరిలో ఉండే సుగుణాలు ఏంటో తెలుసుకోండి మరి.
మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు ఉసిరి నీటిని తీసుకోవడం ద్వారా మధుమేహ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. ఉసిరిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది ఇది మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. అలానే ఉసిరి నీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే చాలామందికి చేతి గోళ్ళలో నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి సమస్యతో బాధపడుతున్న వారు రోజుకి ఒక ఉసిరిని తీసుకోవడం ద్వారా ఆ సమస్యకు స్వస్తి చెప్పవచ్చట.
అలానే ప్రస్తుత కాలంలో చిన్న నుండి పెద్దవారికి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. తీసుకుంటున్న ఆహారం ఏమో గాని ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం వంటి సమస్య అధికమవుతుంది. ఈ సమస్య నుండి అధికమించాలంటే ఉసిరి నీటిని సేవించడం ద్వారా జుట్టు రాల సమస్య తగ్గుతుందట అలానే ముఖముపై మొటిమల సమస్య అధికంగా ఉన్నవారు కాస్త ఉసిరి రసాన్ని ఒకరికి అప్లై చేసుకోవడం ద్వారా మొటిమల సమస్యకు బాయ్ చెప్పవచ్చు.