Health అన్నం ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే అంటున్నారు నిపుణులు.. అయితే అందుకు మినహాయింపుగానే ఈ బ్లాక్ రైస్ ని తీసుకోవచ్చు.. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చు.
బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
వైట్ రైస్ వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు బ్లాక్ రైస్ ను ఎలాంటి సంతోషం లేకుండా తీసుకోవచ్చు ఇది రక్తంలో గ్లూకోజ్ ను సమన్వయ పరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రధాన సమస్య ఆకలి ఎక్కువగా వేయటం అయితే ఈ బ్లాక్ రైసు ఆకలి నియంత్రించడమే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
బరువును తగ్గించడమే కాదు.. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.. ఊబకాయంను దూరం చేస్తుంది.. గుండె పని తీరును మెరుగుపరుస్తుంది.. శరీరంలో లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో బ్లాక్ రైస్ చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకం, విరేచనాలు మొదలైన వాటిని నివారిస్తుంది. కాబట్టి ఏ వయసు వారేనా ఈ బ్లాక్ రైసును ఆహారంలో భాగం చేసుకోవచ్చు..