Health News, Magunta Sreenivasulu Reddy, Magunta Charitable Trust, Kandula Obula Reddy Hospital, Dr. Kandula Gautam Nagi Reddy,
అడగంది అమ్మయినా అన్నం పెట్టదు అంటారు !!
అడగకుండానే అన్నం పెట్టే గుణం “మాగుంట” కుటుంబానికే సొంతం !!
మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో , మాగుంట రాఘవ రెడ్డి గారి ఓదార్యంతో , శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారి ఆశీస్సులతో ..
కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ , మార్కాపూర్ వారికి 23 ఉచిత ఆక్సిజన్ సిలిండెర్స్ మరియు 4 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మరియు 10 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు పంపిణి .
జిల్లాలో కేవలం ఒకే ఒక్క ప్రెవేటు హాస్పిటల్ కి మన శ్రీ కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ వారికి 23 ఆక్సిజన్ సిలిండర్లు , 10 ఫ్లో మీటర్స్ మరియు 4 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వడం మాగుంట రాఘవ రెడ్డి గారు మన వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి ఇచ్చిన గౌరవం .
మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకు జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారు ఒంగోలు లో సిలిండర్లు అందజేయగా , శ్రీ బబిత గారు (DFO ) హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ ,మరియు కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ చైర్మన్ డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి ఈ వస్తువులన్నీ మార్కాపురంలో అందుకోవడం జరిగింది, అలాగే 4 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు , 10 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు 18.05.2021 న హాస్పిటల్ నందు ప్రారంభించి కరోనా రోగులకు అందుబాటులో ఉంచారు !
మాగుంట కుటుంబానికి మన కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్ తరపున హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము !
కష్ట సమయంలో ఆపద్బాంధవుని లాగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు , మాగుంట రాఘవ రెడ్డి గారు
ఎంతో ఔదార్యంతో మనకు అందజేయడం ఎంతో స్లాఘనీయం !!
మాగుంట రాఘవ రెడ్డి గారి ప్రత్యేక చొరవ ప్రశంసనీయం .
ధన్యవాదములు 🙏
ఇట్లు
డా కందుల గౌతమ్ నాగి రెడ్డి
చైర్మన్
కందుల ఓబుల రెడ్డి హాస్పిటల్
మార్కాపూర్ .