Health Tips : జల జీవరాసుల నుండి మానవుడి సైతం నీటిపై ఆధారపడి ఉంటాం. అయితే అధిక స్థాయిలో నీటిని సేవించడం ద్వారా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు ఒక్కరోజులో 1 నుండి 4 లీటర్ల వరకు నీటిని మానవుడు సేవించాలని సూచిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఒబిసిటీ అనే సమస్యతో బాధపడుతున్న వారు. ఆహారాన్ని తగ్గించి అధిక స్థాయిలో నీరుని సేవించడం జరుగుతుంది. అయితే పెద్దలు చెప్తూ ఉంటారు మితిమీరిన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి హానికరమని మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇదే సూత్రం అధికంగా నీటిని సేవించే వారికి కూడా వర్తిస్తుంది.అధికంగా నీటిని సేవించడం ద్వారా ప్రమాదం ఉందండోయ్ అవేంటో తెలుసుకోండి మరి…
ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అధికంగా నీరు తాగడం ద్వారా మన శరీరంలో ఉండే ఉప్పు స్థాయిని తగ్గించడం జరుగుతుంది. తద్వారా వికారం, అలసట, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలానే మూత్రపిండాలు మూత్రపిండాలపై అధిక భారం పడటం ద్వారా మనకు ఒత్తిడి ఏర్పడడంతో దీని వల్ల హార్మోన్ల సమస్యలు ఏర్పడతాయి.
అలానే నీటిని అధికంగా సేవించడం ద్వారా మూత విసర్జన చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని అధ్యయనాల్లో ప్రతి వ్యక్తి రోజుకు 4,5 లీటర్ల నీళ్లు తాగాలని చెపుతుంటారు కానీ.. అది అందరిపై ఆ ప్రభావం పనిచేయదు అని నిపుణులు తెలుపుతున్నారు. కాస్త అధికంగా నీటిని తాగేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల సుమీ…