Migraine Pain : మైగ్రేన్ నొప్పి అనేది ఎక్కువగా ఆలోచించడం ,ఒత్తిడి, నిద్ర లేకపోవడం, వాతావరణంలో మార్పులు, బలమైన వాసనలు, పెద్ద శబ్దాలు, ప్రకాశ వంతమైన దీపాలు, ఆల్కహాల్, కెఫిన్ , చాక్లెట్ వంటి కొన్ని ఆహారాలు, పానీయాలు, హార్మోన్ల మార్పులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
మైగ్రేన్ నొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే చాలా సాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య భిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే చికిత్స మాత్రం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మైగ్రేన్లు ఒక రకమైన తలనొప్పి. తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, కాంతి చూడలేకపోవటం , ధ్వనిని వినలేకపోవటం,నీరస పడిపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. తరచుగా అలసట, మానసికమైన మార్పులు , దృష్టి సమస్యలు వంటి ఇతర లక్షణాలు కలిగిస్తుంది. ఎక్కువగా చిరాకు రావడంలాంటివి కూడా జరుగుతుంది.
మైగ్రేన్‌లకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, అవి జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తాయని భావిస్తున్నారు. న్యూ ఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజీషియన్ డాక్టర్ వివేక్ లూంబా సెరోటోనిన్,కాల్సిటోనిన్ జన్యు సంబంధిత (CGRPPides) వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌లను విడుదల చేసే ట్రైజెమినల్ నాడిని ఓవర్యాక్టివ్ గా నరాల కణాలు ప్రేరేపించినప్పుడు మైగ్రేన్‌లు వస్తాయని తెలిపారు. సెరోటోనిన్,కాల్సిటోనిన్ మెదడు యొక్క లైనింగ్‌లోపలి రక్త నాళాలలో వాపును కలిగిస్తుంది. నొప్పికి దారితీస్తుంది.
దీనికి చికిత్స యోగ ,కొన్ని ఆసనాలు చేయడం . ముఖ్యం గా మనసు ని ప్రశాంతం గా ఉంచడం . అలాగే సరైన సమయంలో భోజనం చేయడం, నిద్రపోవడం, యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి అనుసరించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది