Health Tips : కాలం మారుతున్న కొద్దీ మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటు లోకి వచ్చేశాయి. ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన తర్వాత మొదట చూసేది మొబైల్ ఫోన్ నే. మొబైల్ లేకుండా రోజు గడవదు అంటే అది అతిశయోక్తి కాదు. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూస్తాం, రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ చూడడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా మొబైల్ ని ఎక్కువ సేపు చూడడం వల్ల చాలా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- అప్పటి వరకూ మూసుకొని ఉన్న కళ్లపై ఎక్కువ కాంతి పడడం వల్ల కళ్లు పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఆ వెలుగు పూర్తిగా కళ్ల పై పడుతుంది. దీనివల్ల రోజంతా కళ్లు అంత ప్రభావవంతంగా పనిచేయలేవు.
- ఉదయం మొబైల్ ని పట్టుకొని చూడడం వల్ల మొబైల్ తాలూకు లైట్ కిరణాలు మన కళ్లపై పడి లోపలికి చొచ్చుకుపోతాయి. ఇది మన కళ్లకు అంత మంచిది కాదు.
- అలాగే మొబైల్ వాడకం వల్ల మన రోజంతా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. తల చాలా బరువుగా అనిపిస్తుంది.
అదే విధంగా రోజంతా తలనొప్పిగా ఉంటుంది. - ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకునే అలవాటు మీకుందేమో ఒకసారి చెక్ చేసుకోండి.
- ఈ అలవాటు మానేస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేం. ఒకవేళ ఉంటే దాన్ని మార్చుకుంటే రోజంతా ఫ్రెష్ గా ఫీలయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.