Health Tips : చింతకాయ దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా. ఇది ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి. ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా చింతకాయలు, చింతపండు ఉపయోగిస్తారు. కాగా 100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ఇస్తుంది. ఇది సిట్రిక యాసిడ్ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి, కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. అలానే మరికొన్ని ఉపయోగాలు మీకోసం ప్రత్యేకంగా…
- భోజనానంతరం రసం పోసుకోడంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్నది తేలికగా జీర్ణం అవుతుంది.
- అజీర్ణరోగాలకి, జీర్ణశక్తిని పెంచ డానికి చింతపండు దివౌషధంగా ఉపయోగ పడుతుంది.
- భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూవుంటారు. ఇందు వలన మూత్రకోశ వ్యాధులు, మూత్ర కోశంలో రాళ్ళు, మొదలైన వ్యాధులు అరికట్టవచ్చు.
- గుండె జబ్బులకు కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
- ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైన ఉపయోగాలు ఉన్నాయి.
- సిట్రిక యాసిడ్ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి కడుపు
- ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు.
- ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది.
- శరీరంలోని వాపులకి, నొప్పు లకి చింతపండు ఉపశమనం ఉంటుంది.
- చింతపండు ఎక్కువగా ఉపయోగించే రసంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
- అలానే చింతపండు, చింతకాయ వంటి పులుపు ఆహారాన్ని గర్భిణులు ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు అని అందరికీ తెలిసిందే.