Health Tips : ప్రస్తుత కాలంలో కూర్చొని చేసే ఉద్యోగాలే అధికంగా చేస్తూ ఉండడం వల్ల ప్రజలు పలు అనారోగ్య సమస్య లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో ప్రధానంగా అధిక బరువు కూడా ఒకటని చెప్పాలి. శరీరంలో ఎక్కువగా కదలికలు లేకుండా కూర్చొని మాత్రమే పని చేస్తుండడంతో బెల్లీ ఫ్యాట్ వస్తుంది. డైజెషన్ సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల సమస్యలు, ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా లేకపోవడం, శరీరంలో తగినంత కదలిక లేకపోవడం వంటివన్నీ బెల్లీ ఫ్యాట్ సమస్యను తెచ్చిపెడతాయి. అయితే బెల్లీ ఫ్యాట్ , అధిక బరువు సమస్యల నుండి బయటపడాలని అనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
జీలకర్ర, వాము వాటర్ తయారీ ;
ముందుగా జీలకర్ర, వామును నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లు చల్లారిన తరువాత భోజనం తరువాత మద్యాహ్నం, లేదంటే రాత్రి భోజనం తరువాతైనా తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నెలరోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు గమనించవచ్చు. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.
ఉపయోగాలు :
- బెల్లి ఫ్యాట్ ను తగ్గించడానికి ఇందుకు జీలకర్ర, వాము వాటర్ అద్భుతంగా పనిచేస్తాయని అయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
- జీలకర్ర, వాము రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడంతో ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- శరీరం మెటబోలిజం వేగవంతం కావటంతో పాటు కొవ్వు కరిగేలా చేయటంలో ఈ వాటర్ బాగా ఉపకరిస్తాయి.
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. - భోజనం తరువాత కడుపులో మంట వంటి సమస్యతో బాధపడేవారు భోజనం తరువాత కొద్దిగా జీలకర్ర, వాము నీరు తాగితే ఉపశమం కలుగుతుంది.
- రక్తప్రసరణ సక్రమంగా ఉండి గుండె పనితీరును మెరుగు పరచటంలో ఈ వాటర్ సహాయకారిగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.