Health Tips : శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. వాతావరణ మార్పులతో చర్మ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా గుండెకు సంబంధించి వచ్చే ప్రమాదాల గురించి మరించ జాగ్రత్త వహించాలని అంటున్నారు. శీతాకాలంలో విపరీతమైన చలి కారణంగా చాలామంది గుండెపోటుకు గురువుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని చెప్పుకొచ్చారు. గుండె కండరాలకు సహజసిద్ధమైన రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండె పోటు ఏ సీజన్ లోనైనా, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే శీతాకాలంలో బారోమెట్రిక్ పీడనం, తేమ, గాలి, చల్లని గాలులు శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి కారణంగానే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక శీతాకాలంలో చాలామందికి నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఈ కారకాలన్నీ రక్తపోటు, చివరకు గుండెపోటుకు దారి తీస్తాయి. ఈ తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రతలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా…
ఉదయాన్నే వాకింగ్ : గతంలో గుండెపోటు వచ్చిన వారు ఉదయాన్నే నిద్ర లేవకూడదు. దీని కారణంగా, చల్లని రక్త నాళాలు కుంచించుకుపోతాయి, శరీరం వేడెక్కడానికి చాలా కష్టపడాలి. ఈ సమయంలో మన గుండెపై ఒత్తిడి పెరగుతుంది. చివరకు ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
ఉప్పు : మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. దీనివల్ల రక్తప్రసరణకు ఇబ్బందిగా మారుతుంది. క్రమంగా ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. అలాగే వేయించిన పదార్థాలను దూరంగా ఉంచాలి.
దుస్తులు : శీతాకాలంలో, శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రత్యేక దుస్తులు ధరించాలి. ముఖ్యంగా మన శరీరం మరీ చల్లగా ఉన్నప్పుడు నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి కాలానుగుణంగా మన దుస్తులు ఉండాలని నిపుణులు సూచిస్తారు. అలాగనీ శరీరానికి అసౌకర్యం కలిగించే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించవద్దు.
వ్యాయామం : చలి ఎక్కువగా ఉందని శీతాకాలంలో చాలామంది వ్యాయామాన్ని పక్కన పెడతారు. గుండె ఆరోగ్యకరమైన హృదయ వ్యాయామాలు, ముఖ్యంగా సైక్లింగ్, చురుకైన నడక, పరుగు, జాగింగ్ మొదలైన వాటిని చేర్చుకోవాలి. అయితే ఈ విషయంలో ఫిట్‌నెస్ నిపుణుల సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి.
మద్యం : ముఖ్యంగా శీతాకాలంలో మద్యం సేవించడం చాలా ప్రమాదం. ఆల్కహాల్ శరీరాన్ని వేడి చేస్తుందనేది అబద్ధం. ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల, గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్న శీతాకాలంలో అధికంగా మద్యం సేవించడం ప్రాణాంతకం.