Health Tips : సాధారణంగా ప్రస్తుత కాలంలో అధికంగా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. అయితే మీ రోజువారీ లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. మరి చిట్కాలు ఏంటో ప్రత్యేకంగా మీకోసం…
యోగా : ఉదయాన్నే యోగా చేస్తే బరువు తగ్గుతారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల 13.91 కేలరీలు కరిగించవచ్చు. ఇది సాధారణంగా ఒక గంట కార్డియో సెషన్‌ను బర్న్ చేస్తుందని పాలక్ నోట్స్ వ్యవస్థాపకుడు, పోషకాహార నిపుణుడు పాలక్ మిధా చెబుతున్నారు.
సూర్యరశ్మి : పగలు తగినంత సూర్యరశ్మికి ఉండడం కూడా బరువు తగ్గేందుకు సాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే సూర్యకింది శరీరంలోని కొవ్వుని కరిగించేందుకు సాయపడుతుంది.
వేడి నీరు : ఉదయాన్నే నిద్రలేచాక ఓ గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఇలా చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని చెబుతున్నారు. శరీరంలో ఉండిపోయిన విష మలినాలను ఈ విధంగా దూరం చేసుకోవచ్చని అంటున్నారు. అలాగే త్వరగా బరువు కూడా తగ్గుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్రేక్ ఫాస్ట్ : బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో ముఖ్యమైన ఫుడ్. ప్రోటీన్లు అధికంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి… ఎందుకంటే ఇది ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సాయపడే ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ కోసం మొలకలు, గుడ్లు తీసుకోవడం మంచిది.
మంచి నిద్ర : ఎక్కువ సేపు నిద్ర పోవడం కూడా బరువు తగ్గడంలో సాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేకపోవడం వల్ల కూడా కేలరీలు ఎక్కువగా తీసుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలంటే మంచి నిద్ర అవసరం. రోజుకి కనీసం 8 గంటలు నిద్ర చాలా ముఖ్యం.