Dark Circles : ప్రస్తుతం మారుతున్న కాలానురీతిగా పని ఒత్తిడి, నిద్ర లేని కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఆ కారణంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కంటి చుట్టూ ఉండే ఈ డార్క్ సర్కిల్స్ ని ఎలా పోగొట్టాలో మీకోసం ప్రత్యేకంగా..
అరటి తొక్క..
అరటి తొక్కలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా కాపాడతాయి. అంతేకాదు, అరటిపండు తొక్కలో కొల్లాజెన్ ఉంటుంది. ఇది రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది.
ముందుగా అరటి పండు తొక్కని తీసుకుని దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మీ కళ్ళ కింద రుద్దండి. మీరు ఈ తొక్కలను కళ్ళ కింద సుమారు 15 నిమిషాల ఉంచండి. తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి. మీరు దీనిని వారానికి 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అరటిపండు తొక్క పేస్ట్‌ని ఇలా వాడితే, కళ్ల కింద నల్లని వలయాలు కచ్చితంగా దూరం చేసుకోవచ్చు.
ముందుగా అరటిపండు తొక్కని మెత్తగా చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని కంటి కింద అప్లై చేయాలి. దీని తర్వాత మీరు సుమారు 8 నుంచి 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత ముఖం కడగాలి. ఇలా చేయడం వల్ల తేమని అందించి నల్లని వలయాలని దూరం చేస్తుంది. అందంగా కనిపించడంలో కళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరి ముఖం ఎంత అందంగా ఉన్నా కంటి కింద నల్లటి వలయాలు ఉంటే అంతగ ఆకర్షించదు. ఈ డార్క్ సర్కిల్స్‌ని దూరం చేయడంలో అరటిపండు తొక్కఎంతగానో సాయపడతుందని చెబుతున్నారు నిపుణులు. అరటి తొక్కలో ఎక్కువగా పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కింద నల్లని వలయాలని దూరం చేస్తుంది.