Health రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎంతమంది చెప్తున్నా కొందరు పాటించరు.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహరం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని చెబుతున్నారు నిపుణులు.. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉదయాన్నే ఏం తీసుకోవాలో ఒకసారి చూద్దాం..
రోజువారి జీవితంలో శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం మెగ్నీషియంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరం రోజంతా చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి.. అంతే కాకుండా ఎముకలు దృఢంగా ఉండటానికి.. నరాలు, కండరాలు, రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా ఇవి అవసరం..
పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.. అలాగే ఇడ్లీతోపాటు కొబ్బరి చెట్నీ వంటివి తీసుకుంటూ ఒక గ్లాసు పాలు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకుంటే రోజంతా అలసట దరిచేరదు రోజుకో యాపిల్ని తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు ఈ ఆపిల్ ను అల్పాహారం లో భాగం చేసుకోవడం ఇంకా మంచిది.. అలాగే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్ ను తీసుకోవడం కూడా మంచిదే ఉదయాన్నే గుడ్డు తీసుకోవటం మంచిది. నేరుగా గుడ్డు తినాలి అనిపించకపోతే హాఫ్ బాయిల్ చేసుకుని తిన్నా శరీరాన్ని కావలసిన పోషకాలు అందుతాయి..