Health నిద్రలేస్తూనే చాలామంది ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటారు.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో వచ్చి నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారు.. ఇలా తెలియకుండానే ఎంతో విలువైన సమయం గడిచిపోతుంది.. ఇలా కాకుండా నిద్ర లేవగానే కాసేపు ఎండలు నడవడం అలవాటు చేసుకోవాలి.. ఈ నడక అనేది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎండలో ఉండే డి విటమిన్ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది..
వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు వ్యాయామం చేయటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. అదే విధంగా ఎప్పుడు కూర్చొని పని చేసేవాళ్లు పని మధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి.. రోజుకు ఆరు నుంచి ఎనిమిది లీటర్లు నీరు తాగటం చాలా మంచిది. అలాగే రాత్రిపూట వీలైతే ఎనిమిది గంటల లోగా ఆహారాన్ని తీసుకోవటం చాలా ఉత్తమం. రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి చేసుకోవాలి.
చాలామంది నిద్రపోయే సమయంలో ఫోన్ పక్కనే పెట్టుకొని పడుకోవటం లేదా దిండు కింద పెట్టుకోవడం చేస్తుంటారు.. ఇది చాలా ప్రమాదకరం ఫోన్, లాప్టాప్ ల వల్ల వచ్చే రేడియేషన్ తర్వాత చాలా సమస్యలకు దారితీస్తుంది.. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు ఫోను దూరం పెట్టాలి.. మైగ్రేన్, బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యలకు వీటిని నుంచి వచ్చే రేడియేషన్ కూడా ఒక కారణం.