Health హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు 50.. 60 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వచ్చేదిగా భావించేవారు కానీ ప్రస్తుతం 40 దాటిన వాళ్లు కూడా హార్ట్ ఎటాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే హార్ట్ కి సంబంధించి వచ్చే ఇబ్బందుల్ని ప్రతి ఒక్కదాన్నే హార్ట్ ఎటాక్ గాని భావించరాదు.. ఇందులో చాలా రకాలు ఉన్నాయి..
హార్ట్ కి సంబంధించి ఏదైనా సమస్య వచ్చింది అంటే హార్ట్ ఎటాక్ వచ్చింది అనుకుంటాం కానీ హార్ట్ ఎటాక్ ఒకటే కాదు దీనిలో మూడు రకాలు ఉంటాయి అవి హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్.. స్ట్రోక్ గా చెప్పవచ్చు.. ముఖ్యంగా ఎక్కువ మందిలో కనిపించే సమస్య హార్ట్ ఎటాక్ హార్ట్ ఎటాక్ అంటే గుండేకు రావలసిన రక్తం ఒక్కసారిగా ఆగిపోతుంది.. దమనంలో ఎక్కడో ఒకచోట రక్తం ఆగిపోవడం వల్ల ఒకసారిగా రక్తం గడ్డకట్టి గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది.. దీన్నే హార్ట్ ఎటాక్ అంటారు..
అలాగే హార్ట్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ని బ్రెయిన్ ఎటాక్ అని కూడా అంటారు ఈ సందర్భంలో బ్రెయిన్ రక్త సరఫరా ఆగిపోతుంది.. బ్రెయిన్ లో ఏ భాగానికి అయితే రక్త సరఫరా ఆగిపోతుందో ఆ భాగం సరిగా పనిచేయదు ఇటువంటి వ్యక్తుల్ని ఎంత తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తే అంత మంచిది.. అలాగే గుండెకు సంబంధించిన మరో ప్రమాదకరమైన సమస్య కార్డియాటిక్ అరెస్ట్.. ఇందులో ఒక్కసారిగా గుండె పని చేయటం ఆగిపోతుంది.. వెంటనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతారు.. ఎటువంటి స్పందన ఉండకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోతారు..