స్టార్ దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్ తేజ్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మించిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న ‘ఆహా’ వేదికగా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఒరేయ్ బుజ్జిగాలో క్యామియో రోల్ చేశాను. అప్పుడే నిర్మాత రాధా మోహన్ గారు నాతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు చాలా వింటాం. లాక్ డౌన్ లో ఫోన్ చేసి ‘ఓదెల రైల్వేస్టేషన్ గురించి చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యా. మాటని నిలబెట్టుకునే మనుషులు చాలా తక్కువగా వుంటారు. ఈ విషయంలో రాధా మోహన్ గారికి చాలా థాంక్స్. సంపత్ నంది గారు ఈ కథ చెప్పినపుడు చాలా సర్ ప్రైజ్ ఫీలయ్యా. ఇలాంటి పాత్రని నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను చేయగలనా ? అనే అనుమానం కూడా వచ్చింది. ఐతే సంపత్ గారు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. నా కెరీర్ లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కష్టాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నా పాత్ర ఒక సవాల్ తో కూడుకున్నది. ఒక నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ లాంటి మంచి టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.