Her Sundeep Kishan, VI Anand, Rajesh Danda’s SK28 Announced, Latest Telugu Movies,
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మాతగా వెర్సెటైల్ హీరో సందీప్ కిషన్ 28వ చిత్రం ప్రకటన
తను నటించే ప్రతి సినిమాలోనూ ఓ కొత్తదనాన్ని చూపిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు యంగ్ వర్సెటైల్ హీరో సందీప్ కిషన్. తన తదుపరి చిత్రాల జానర్స్ ఎంపికలోనూ వైవిధ్యత ప్రదర్శించడం సందీప్ కిషన్ ప్రత్యేకత. ఈ అంశాలను ఫాలో అవుతూనే సందీప్ కిషన్ మరో ఆసక్తికర సినిమాను ఓకే చేశారు. కథ, కథనాల ప్రకారం ఈ సినిమా సందీప్ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక మూవీగా నిలవనుంది. అంతే కాకుండా సందీప్ కిషన్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం కావడం విశేషం.
సందీప్‌కిషన్‌కు ‘టైగర్’ వంటి మంచి ప్రేక్షకాదరణ లభించిన సినిమాను అందించిన విభిన్న దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాన్సెప్ట్ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్ కిషన్‌కు టైగర్ ఒక కొత్త తరహా చిత్రం. ముఖ్యంగా సందీప్ కిషన్ పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు.
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత హీరో సందీప్‌కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో మరో మూవీ గా వస్తున్న ఈ చిత్రం కథ, కథనాలపై ఇండస్ట్రీలో అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలైయ్యాయి. నేడు (మే7, శుక్రవారం) సందీప్‌కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో సందీప్‌కిషన్ ఏదో ఒక మిస్టీరియస్ లొకేషన్‌ను ఐడెంటీఫై చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. విభిన్న తరహా కథ, కథనాలు అందించే దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించిన దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాకు కూడా ఓ వినూత్నమైన, ప్రేక్షకులు ఊహించని కథను రెడీ చేశారు.
హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట ఈ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం
కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో
ప్రకటించనున్నారు.
హీరో: సందీప్ కిషన్
సాంకేతిక నిపుణుల బృందం
దర్శకుడు: వీఐ ఆనంద్
నిర్మాత : రాజేష్ దండ
బ్యానర్: హాస్య మూవీస్
సహ నిర్మాత: బాలాజీ గుట్ట
పీఆర్వో: వంశీ– శేఖర్
The film’s shoot begins when its safe. The other cast and crew of SK28 will be announced later.
Cast: Sundeep Kishan
Technical Crew:
Director: VI Anand
Producer: Rajesh Danda
Banner: Hasya Movies
Co-producer: Balaji Gutta
PRO: Vamsi-Shekar