Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ సాధించారు. తన కెరీర్‌లోనే వంద కోట్ల మైలు రాయిని టచ్ చేశారు మన మెగా క్యాంప్ కథానాయకుడు. నెక్ట్స్ ఈ కుర్ర హీరో ఏ దర్శకుడితో సినిమా చేస్తారు … అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు, డైరెక్టర్ సంపత్ నందితో మూవీ చేయడానికి సాయిధరమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గతంలో రామ్ చరణ్‌తో రచ్చ వంటి సినిమా చేసి కమర్షియల్ హిట్ కొట్టిన సంపత్ నంది తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలు చేసి కమర్షియల్ డైరెక్టర్‌గా తన మార్క్ చూపించుకున్నారు.
రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్‌కి సూట్ అయ్యేలా ఓ కాన్సెప్ట్‌ను అనుకుని చెప్పటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా సంపత్ నంది చేసిన మూవీస్‌లో ఎక్కువ శాతం ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తుంటారు. అదే ఫార్ములాను ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మూవీకి కూడా అప్లయ్ చేస్తున్నారట. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కోసం ఇద్దరు హీరోయిన్స్‌ను అప్రోచ్ అవుతున్నారట మేకర్స్. వారిలో ఒకరు పూజా హెగ్డే (Pooja Hegde) కాగా.. మరొకరు శ్రీలీల (Sreeleela). వీరిద్దరిలో ఒకరు ఫైనల్ అయితే తర్వాత సెకండ్ హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారట.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల చేతిలో ఇప్పుడు పదికి పైగా భారీ చిత్రాలే ఉన్నాయి. ఆమె డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో తెలియటం లేదు. పూజా హెగ్డే ముందున్నంత బిజీగా మాత్రం లేదు. ఆమె రెమ్యూనరేషన్ కూడా తగ్గింది. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నుంచి సినిమా సెట్స్ పైకి వెళుతుందనే న్యూస్ బలంగా నెట్టింట వైరల్ అవుతుంది.