టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ హీరో సందీప్ కిషన్‌కి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదలవుతోంది.
బుధవారం ఈ చిత్రంలోని “అమిగో” అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మూవీలో ఈ సాంగ్‌ను సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి, డాన్సర్స్‌పై చిత్రీకరించారు. హుషారైన బీట్‌తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్‌లో హీరోయిన్‌పై తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు హీరో.
తారాగణం :
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ, మహేష్ విట్టా, రఘుబాబు, అభిజిత్, భూపాల్, ఖయ్యుమ్, సుదర్శన్, శ్రీరంజని, దయా గురుస్వామి.
సాంకేతిక బృందం :
దర్శకుడు: డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్, అభిషెక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజ్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, సామ్రాట్
ఆర్ట్: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మయాంక్ సింఘానియా, దివ్య విజయ్, శివ చెర్రీ, సీతారామ్
పీఆర్వో: వంశీ-శేఖర్.