మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘ఉప్పెన’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని.. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. దీంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన డీఎస్పీ అద్దిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. ‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగే పాట.. ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరో రెండు పాటలు కూడా శ్రోతలను అలరించాయి. పైగా మెగా వారసుడు.. ఇలా పలు సానుకూల అంశాలతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఉప్పెన’ ఇంతకు ముందున్న డెబ్యూ సినిమాల రికార్డును దాటేసే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు.. హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన డెబ్యూ మూవీస్ గా రామ్ చరణ్ ‘చిరుత’ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ నిలిచాయి. తొలిరోజు కలెక్షన్ల విషయంలో రామ్ చరణ్ ‘చిరుత’ను దాటే చాన్స్ లేనప్పటికీ.. లాంగ్ రన్ క్లోజింగ్ నాటికి చిరుతను దాటొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. అరంగేట్ర హీరోకు అంతకు మించిన అద్భుతమైన ఫీట్ మరొకటి ఉండదు. మరి ‘ఉప్పెన’ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.