హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 లో ఏర్పాటు చేసిన సెవెన్ ఓక్ పేట్స్ ఇండో అమెరికన్ ఆసుపత్రిని సినీ నటుడు విజయ దేవరకోండ, ఆనంద్ దేవరకోండలు ప్రారంబించారు. ఈ హాస్పిటల్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన వివిధ రకాల వైద్య సేవలు అందించబడతాయి. వీటిలో సాధారణ వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్లు, గ్రూమింగ్, బోర్డింగ్ వంటి సేవలు ఒకే చోట ఉండే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
పెట్స్ ని పెంచడం అంటే చిన్న పిల్లలను పెంచినంత ఓపిక ఉండాలని సినీ నటుడు విజయదేవరకోండ అన్నారు. అతి పెద్ద పెట్స్ హాస్పిటల్, సరికొత్త టెక్నాలజీతో, యూఏస్ఏ తరహా మెడిసిన్ సరికొత్త పెట్స్ వైద్యం అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని విజయ తెలిపారు. తమ పెట్ ని ఇక్కడికే తీసుకువచ్చి ట్రీట్మేంట్ చేయుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ హాస్పిటల్‌ను హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించడం జంతు ప్రియుల దృష్టిని మరింతగా ఆకర్షించింది.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్