Hero Vishwak Sen Launched Boyfreind For Hire Movie Teaser,Vishwanth Duddumpudi,Malavika Sateeshan,Santhosh Kambhampati,Latest Telugu Movies
హీరో విశ్వక్‌సేన్ రిలీజ్ చేసిన విశ్వంత్ దుద్దుంపూడి, సంతోష్ కంభంపాటిల `బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్` మూవీ టీజర్.
విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్`. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ మరియు ఇప్పటికే విడుదలచేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ క్రియేటివ్‌గా ఉండటంతో ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ మూవీ టీజర్‌ను యంగ్ హీరో విశ్వక్‌సేన్ రిలీజ్‌చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కిందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ బిజినెస్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేకుండా కేవలం హర్డ్ వర్క్ అండ్ టాలెంట్ మా మెయిన్ అంజెండాగా స్టార్ట్ అయ్యింది కాబట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటూ విశ్వంత్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఎంటర్టైనింగ్‌గా సాగింది. ఇక చివరలో కథ పూర్తిగా వినకుండా ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా తప్పు తెలుసా..అనే హీరో చెప్పే డైలాగ్ ఆడియన్స్‌కి ట్విస్ట్ ఇచ్చింది. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ని మరింత ఎలివేట్ చేసింది అలాగే బాలసరస్వతి విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ టీజర్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.
తారాగణం:
విశ్వంత్ – మాళవిక సతీషన్- పూజా రామచంద్రన్- హర్షవర్ధన్- నెల్లూరు సుదర్శన్- మధునందన్, అమృతం అప్పాజీ- రాజా రవీంద్ర- రూప లక్ష్మి
సాంకేతికవర్గం:
రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
నిర్మాతలు: వేణు మాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అశ్రిన్ రెడ్డి
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫి: బాల సరస్వతి
ఎడిటర్: విజయ్ వర్ధన్. కె
లిరిక్స్: రహమాన్, రాకేందుమౌళి
కొరియోగ్రాఫర్: విజయ్ ప్రకాశ్
పిఆర్ఓ: వంశీ- శేఖర్