సినీ పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘వైధా’లో హీరోయిన్‌గా నటించిన దీప.. చెన్నైలోని విరుగంబాకంలో తన గదిలో సూసైడ్ చేసుకుంది.
చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా ఎదిగిన దీప.. అర్ధాంతరంగా ఇలా దూరమవడం పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఆమె డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.


























