శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రదారులుగా ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి చైతన్య సమర్పణలో ’90ml’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆత్మీయ అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు చంద్రమహేష్, మధుర శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి, చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి, అనూప్ రూబెన్స్, చంద్రబోస్, నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, డీవోపీ యువరాజ్, కళాదర్శకుడు శేఖర్, వేణుమాధవ్ పెద్ది తదితరులు పాల్గొన్నారు..
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత పిల్లల సినిమా వస్తుంది. ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.. నో డౌట్” అన్నారు.