Health : ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంతో హాన్ చేస్తుంది ఈ విషయం తెలిసిన చాలామంది ఈ వ్యసనాన్ని మానుకోలేక పోతారు గుండె కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఆల్కహాల్‌ను వదిలించుకోలేకపోతూ ఉన్నవాళ్లు ఎంతోమంది అయితే వీరందరికీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఆల్కహాల్ దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి అవేంటో చూద్దాం..
మద్యపానం వల్ల ఆరోగ్యం ఎంతగానో దెబ్బతింటుంది ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు రావడంతో శరీరం మొత్తం ప్రభావం అవుతుంది.. ఆల్కహాల్ తాగడం వల్ల డీహైడ్రేషన్, కడుపులో ఎన్నో వ్యాధులు వస్తాయి.. నాడీ వ్యవస్థను కూడా మద్యం ఎంతగానో ప్రభావితం చేస్తుంది.. అయితే కొన్ని రకాల హోం రెమెడీలతో ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు.
ఆల్కహాల్ లో తాగాలి అనిపించిన ప్రతిసారి నాలుగు నుంచి ఐదు ఎండు ద్రాక్షను తీసుకోవాలి దీనివల్ల ఆల్కహాల్ తాగాలి అనే ఆలోచన చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు అలాగే ఖర్జూరాన్ని తురిమి ఆ నీటిని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.. క్యారెట్ రసాన్ని తరచు తీసుకోవడం వల్ల మద్యం వైపు మనసు వెళ్లదని చెబుతున్నారు అలాగే తులసి ఆకులను నమ్మడం వల్ల కూడా మద్యం తాగాలనే ఆలోచన చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.. అశ్వగంధ పొడిని కొంచెం పాలలో కలిపి తాగటం వల్ల కూడా మద్యపానం ఆలోచన తగ్గుతుంది అని తెలుస్తుంది..