Health క్యాన్సర్.. ఈ మాట వింటేనే చాలామంది భయపడిపోతారు ఇందులో ముఖ్యంగా మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ తో ప్రాణానికి కూడా ప్రమాదం తప్పదు అయితే ఎలాంటిది సమస్య అయినా మనం సకాలంలో గుర్తిస్తే సగం పరిష్కారం చేయవచ్చు అంటున్నారు అందుకుగాను బ్రెస్ట్ క్యాన్సర్ తొందరగా గుర్తించాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
2020 డేటా ప్రకారం, క్యాన్సర్ వల్ల దాదాపు 10 మిలియన్ల మంది మరణిస్తుంటే.. అందులో 2.26 మిలియన్ మంది రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేలమంది ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో చనిపోతున్నారు అయితే వ్యాధి సకాలంలో గుర్తించాలి అంటే..
బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్ ఉంటాయి.. అలాగే బాగా ఎరుపెక్కడం.. చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకల కిందిభాగంలో గడ్డలు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. అలాగే రొమ్ముల్లో నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కుంగినట్లుగా అయిపోతాయి.. ఇవి గుర్తించి సకాలంలో వైద్యులను సంప్రదిస్తే.. క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యప్తి చెందకుండా ఉండటానికి జాగ్రత్తలు సూచిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో విజయవంతంగా పోరాడటానికి, దానిని ముందుగా గుర్తించడం చాలా అవసరం.. అలాగే ఈ వ్యాధిలో కీమోథెరపీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని అందరికీ తెలిసినప్పటికీ.. సర్జరీ, బయోలాజికల్, హార్మోన్ థెరపీ, రేడియేషన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి..