Health వృద్ధాప్యంలో భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఉంటే పర్వాలేదు.. కానీ మారుతున్న పరిస్థితులు బట్టి ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటున్నారు. ఇలా పిల్లలు దూరంగా ఉండే తల్లి తండ్రి వృద్ధాప్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా మిగిలిన వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అయితే ఈ ఒంటరితనాన్ని కూడా ఎలా ఈ వయసులో ఎలా అధిగమించాలో తెలుసుకుందాం..
జీవితంలో ఎన్నో చేయాలి అని అనుకుంటాం.. కానీ ఉద్యోగం బాధ్యతలు పిల్లల పెంపకం వీటన్నిటితో ఏమి చేయలేక పోతాం. అయితే వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నామో.. ఏం నేర్చుకోవాలి అనుకున్నామో.. ఇప్పుడు అవి ఒకసారి ప్రయత్నించి చూడండి.. ఎప్పుడో స్కూల్ కాలేజ్ రోజుల్లో విడిపోయిన స్నేహితుల ఫోన్ నెంబర్లు సంపాదించి వారిని పలకరిస్తూ ఉండండి.. మీ పనులు ఇంటి పనులు వీలైనంతవరకు మీరే చేసుకోండి.. మీకు ఇష్టమైన వంటకాలు వండటానికి ప్రయత్నించండి..
ప్రతిరోజు వీలైనంత దూరం నడవడానికి ప్రయత్నించండి..
మీ పాత స్నేహితులని కలవడం అలవాటు చేసుకోండి.. ఇంటిలో మొక్కలు పెంచుకోవడం, పెంపుడు జంతువులను పెంచుకోవడం చేయండి. వీటి సంరక్షణ మీరే చూసుకోండి.. ఈ విషయం మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది.. చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న పిల్లలతో ఆడుకోవడం వాళ్ళని మీ దినచర్యలో భాగం చేసుకోవడం చేయండి..
పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటే వారి మీద బెంగ వదిలి ప్రశాంతంగా గడపటానికి ప్రయత్నించండి.. సమయానికి నిద్రపోతూ.. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఏ వయసులో అయినా ఆడుతూ పాడుతూ తిరగొచ్చు.