Health మారిపోతున్న జీవనశాల తో పాటు మనుషులు అలవాట్లు కూడా మారిపోతున్నాయి ఈ కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య డిప్రెషన్ దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
ఆర్థిక పరమైన సమస్యలు.. ఇంట్లో గొడవలు కారణాలు ఏవైనా కావచ్చు ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య డిప్రెషన్. చాలా చిన్నదిగా కనిపించే ఈ నాలుగు అక్షరాలు మాట మనిషిని నిలువునా నాశనం చేస్తుంది అందుకే కచ్చితంగా డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి.
డిప్రెషన్ దూరం అవ్వాలంటే కచ్చితంగా కొత్త పరిచయాలు పెంచుకోవాలి.. చాలామంది డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటారు అలా చేయకుండా తగినంత సమయం కుటుంబ సభ్యులతో గడపాలి. దీనివల్ల కచ్చితంగా ఒత్తిడి దూరం అవుతుంది.. అలాగే పని ఏదైనా కచ్చితంగా చేయాలి ఇష్టమైన పనిలో నిమగ్నమైనప్పుడు డిప్రెషన్ దరిచేరదు. ప్రతికూల భావాలని దూరం చేసుకోవడం అన్నిటికన్నా ముందు కచ్చితంగా చేయాలి. జీవితంలో వచ్చే ప్రతి కష్టాల్ని ఎదుర్కోవటం నేర్చుకోవాలి. కష్టంగా అనిపించే విషయాలకు దూరంగా వెళ్లిపోవటం కన్నా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఎప్పుడూ ఇతరులతో పోల్చుకొని కుంగుబాటుకు లోను అవకూడదు. ఎల్లవేళలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి దీని వలన కచ్చితంగా ఈ ప్రభావం మన మెదడుపై ఉంటుంది అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సాధారణమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి చాలాకాలం నుంచి చేయలేని పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా కచ్చితంగా తామే విషయం నుంచి బయటపడగలం అని తమని తాము నమ్మాలి..