Movie News:బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్‌రోషన్ కి ఎవ్వరు సాటిరారు అనే చెప్పుకోవాలి. బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతారు హృతిక్ రోషన్. ఆ మధ్యకాలంలో భార్యతో విడాకులు కంగనా రనావత్ లవ్ స్టోరీతో హృతిక్ సినిమా జీవితం ముగిసిపోయిందనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఆ చిక్కుల నుండి బయటకు వచ్చి సినిమాలలో దూసుకుపోతున్నారు ఈ హీరో.
అయితే తాజాగా ఈ హీరో మీద ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఉజ్జయిని మహాంకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు హృతిక్ పై మండిపడుతున్నారు.హృతిక్‌రోషన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో హృతిక్ రోషన్ తప్పేంటి అబ్బా అందరు ఆలోచిస్తున్నారు. ఈ బాలీవుడ్ గ్రీకువీరుడు జొమాటో తాజా యాడ్‌లో నటించడమేనండోయ్.
తాజాగా హృతిక్‌రోషన్‌తో ఓ యాడ్చేసి వీడియోలు విడుదల చేసింది జొమాటో కంపెనీ.ఈ యాడ్‌లో హృతిక్ చెప్పిన డైలాగ్‌లు ఉజ్జయిని మహాంకాళేశ్వరం ఆలయ పూజారులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అయితే వీడియోలో ఏముందంటే… ఆకలి వేసి ఫుడ్ఆర్డర్చేసుకుంటాడు. అయితే మిగతా కమాండోలు ఈ ఫుడ్ఆర్డర్ఎవరిచ్చారు? అని ప్రశ్నించగా.. నేనే ఉజ్జయినిలోని మహాకాళ్నుంచి తాలీ ఆర్డర్చేశా’ అని హృతిక్ రోషన్మిగతా కమాండోలకు చెబుతున్నట్లుగా ఈ యాడ్ లో ఉంటుంది.దీనిపై పూజారులు పవిత్రమైన అమ్మవారి తాళి గురించి ఇలా చేయడం సరికాదని మేము దీనిని ఖండిస్తున్నామని.హృతిక్ రోషన్ తమ క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దీని పేరు హృతిక్ రోషన్ స్పందించలేదు చూడాలి మరి ఈ వార్త పై హృతిక్ రోషన్ స్పందిస్తారో లేదో అనేది.