ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. అలాగే థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన అమ్మవారి, పోతురాజు ప్రత్యేక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల కేరింతలు మధ్య లైగర్ ట్రైలర్ గ్రాండ్ గా విడుదలైయింది.
”ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ” అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బమ్స్ మూమెంట్స్ తో అద్భుతం అనిపించింది. ఫస్ట్ గ్లింప్స్ లో లైగర్ ని మాత్రమే పరిచయం చేయగా ట్రైలర్ లైగర్ వైల్డ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంఎంఎ టైటిల్‌ను గెలవడానికి చేసిన ప్రయాణాన్ని ట్రైలర్ లో పవర్ ప్యాక్డ్ గా చూపించారు. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి.
ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి వుండటం బిగ్ సర్ప్రైజ్, ఛాలెంజ్. ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కారించారు. ‘ఐ లవ్ యూ’ అనే మాటని లైగర్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగా వుంది. ట్రైలర్.. లైగర్ ప్రయాణంలోని ఎమోషన్ ని ఎత్తుపల్లాలని అద్భుతంగా ప్రజంట్ చేసింది. ట్రైలర్ లో లెజెండ్ మైక్ టైసన్ స్టైలిష్ ఇంట్రో మ్యాజికల్ మూమెంట్ గా వుంది. ” ఐయామ్ ఏ ఫైటర్”అని విజయ్ అంటే.. దానికి బదులుగా ”నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి ? ”అనే అర్ధం వచ్చేలా మైక్ టైసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ని ఇచ్చింది.