Bhakthi దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అరుణాచలం చాలా ప్రసిద్ది గాంచిన పుణ్య క్షేత్రం. తమిళనాడులో ఉన్న అరుణాచల క్షేత్రం దర్శించుకోవడానికి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఏటా పార్ణమి రోజు జరిగే గిరిప్రదక్షిణ ఎంతో ప్రసిద్ది గాంచింది.
అరుణాచలంలోలో శివుడు అగ్ని రూపంలో కొలువైయుంటాడు. అగ్ని రూపంలో ఉన్న ఈ శివలింగం అనేది అత్యంత వేడిని ప్రజ్వలిస్తుంది. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలతం వల్లే అరుణాచలాన్ని దర్శించగలుగుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భక్తులు మహాదేవుడిగా భావించిన రమణ మహర్షి ఆత్మ స్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన, జ్యోతిని దర్శించినా, ఆ పుణ్య క్షేత్రానికి ఒకసారి వెళ్లిన జన్మ జన్మల ఫలితంగా భక్తులు భావిస్తారు.
అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రంగా పురాణాల నుంచి కీర్తించబడుతుంది. కార్తీక పౌర్ణమినాడు దీపాలతో దేదీప్యమానంగా వెలుగిపోతుంది. ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి.