Reasons Of Baldness బట్టతల అంటే ఇన్నాళ్లు వయసు మళ్ళి వాళ్ళకి మాత్రమే వచ్చేది అని అనుకునేవారు కానీ ఇప్పుడు సాధారణంగా 30ల్లో కూడా ఈ బట్ట తల కనిపిస్తుంది.. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పెరిగిపోతున్న కాలుష్యం, తినే తిండి, చుట్టూ ఉన్న పరిసరాలు కూడా బట్టతలకు కారణాలుగా చెప్పవచ్చు.
సాధారణంగా బట్ట తల అనేది వంశపారపర్యంగా వస్తుందంటారు. అయితే ఈ ప్రక్రియ ఎంత తొందరగా జరుగుతుందనేది ఆ వ్యక్తి యొక్క జన్యువులు, హార్మోన్లు, వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. రోజుకు మన తల మీద 50 నుంచి 100 వెంట్రుకల వరకు ఓడిపోవడం సాధారణం అయితే ఇంతకుమించి ఊడిపోతుంటే ఆలోచించాల్సిందే. ఈరోజుల్లో రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం పెద్ద హెయిర్ పెంచడం, సెలూన్స్ లో వాడే వివిధ రకాల క్రీములు జుట్టుకు హాని చేస్తున్నాయి. వీటి ప్రభావం ఇప్పట్లో ఉండకపోయినా తర్వాత జుట్టు ఊడిపోవడం రంగు మారిపోవడం చిట్లిపోవడం జరుగుతూ ఉంటాయి. జుట్టు ఊడిపోవడానికి ఒత్తిడి కూడా మరో కారణం.
బయట లభించే జంక్ ఫుడ్ లకు ప్రోటీన్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడానికి నివారించవచ్చు. గుడ్లు, మొలకెత్తిన గింజలు, బాదం వంటి వాటిలో హై ప్రోటీన్ ఉంటుంది. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల్ని వాడటం తగ్గించాలి. వేళకు పడుకుంటూ సరైన తిండి తీసుకుంటే బట్ట తల రావటం నివారించవచ్చు.