Kidney Health జీవక్రియ సక్రమంగా జరగాలి అంటే మొదటి ప్రాధాన్యం కిడ్నీలదే. అలాంటి వాటిని ఈ రోజుల్లో మారిపోతున్న జీవన శైలితో సరిగ్గా పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇలా అయితే దీర్ఘకాలం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కిడ్నీలు చేడిపోవడానికి ప్రధాన కారణాలు.. ఎక్కువసేపు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకోవటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే బయట ఎక్కడున్నా ప్రయాణాల్లో ఉన్నా యూరిన్ నుకంట్రోల్ చేసుకోవడం అంత మంచి పని కాదు. సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం, ఎక్కువగా మెడిసిన్స్ వాడటం, మాంసాహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, నీరు మరీ ఎక్కువగా లేదంటే మరీ తక్కువగా తీసుకోవడం, తరచూ కూల్ డ్రింక్స్ తాగటం ఇవన్నీ కూడా కిడ్నీ మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి.
మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా, ఆకలి వేయకపోయినా, అవి ఉన్న ప్రాంతంలో నొప్పిగా అనిపించినా, అకస్మాత్తుగా బరువు తగ్గినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెక్ చేయించుకోవడం మంచిది. ఏ విషయంపైనా ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం.