Movie మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు…
మణిరత్నం ఈ సినిమాను ఎన్నో ఆశలతో తెరకెక్కించారు అసలు ఈ సినిమా అనుకున్నప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ తో ప్లాన్ చేశారు.. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో మహేష్ బాబు, విజయ్ లతో ఈ చిత్రం తీయాలి అనుకున్నారు.. అయితే ఈ సినిమాకి ఫైనాన్షియర్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వెనక్కి తగ్గారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంత కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఒక ఇద్దరు మాత్రం మణి రత్నంను బాగా భయపెడుతున్నారు. వీళ్లిద్దరూ ఎవరంటే.. హాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, తమిళ్ హీరో ధనుష్.. హృతిక్ రోషన్ సెప్టెంబర్ 30న ‘విక్రమ్ వేద’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఇదే రోజున ధనుష్ నటించిన ‘నానే వరువేన్’ రిలీజ్ అవుతోంది. సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ఈ రెండు మూవీస్ పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే గాని లాభం ఉండదు.
అయితే ఇంకో వారం తర్వాత విడుదల చేద్దాం.. అంటే అప్పటికి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో రాబోతున్నారు. అలాగే నాగార్జున నటించిన ది గోస్ట్ మూవీ కూడా అప్పుడే విడుదలవుతుంది. ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలంటే సెప్టెంబర్ 30 వరకు ఆగాల్సిందే.

























