Movie దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా లతో తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలుగు చిత్రసీమ స్థాయిని ప్రపంచానికి తెలియచేశాయి… ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను అందుకున్న బహుబలి దాదాపు రూ.2 వేల కోట్ల కలెక్షన్లను సాధించాయి.అయితే ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లైనా ఈ మూవీ గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో ఓ రెండు పాటలకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది..
బాహుబలి పార్ట్ 1 లో అవంతికను(తమన్నా) వెతుకుతూ మహేంద్ర బాహుబలి(ప్రభాస్) వెళ్తారు. ఆ సమయంలో ధీవరా సాంగ్ వస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాక పచ్చబొట్టేసిన పాట వస్తుంది.. అయితే ఈ రెండు పాటల కోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం తెలుస్తుంది.. ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖర్చు చేశారట. వీటిలో వచ్చే అత్యంత అద్భుతమైన గ్రాఫిక్స్ తో అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ఈ న్యూస్ విన్నా నెటిజన్లంతా ఔరా అంటున్నారు.. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్ లో ఐదేళ్లు వెచ్చించారు. 2012 సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు మరి ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ప్రభాస్ ఈ సినిమా పూర్తి చేశారు.


























