Health పెద్ద వాళ్లతో పోలిస్తే చిన్నపిల్లలు ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో బయట తినటం అలవాటయిపోయింది. పిల్లలు కూడా బయట ఫుడ్ ని కావాలని మారం చేయడం ఎక్కువైంది. ఇలా బయట జంక్ ఫుడ్ ని తీసుకున్నప్పుడు పిల్లల పొట్ట అప్సెట్ అవుతుంది. ఇలాంటి తప్పకుండా సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
పిల్లల రోగ నిరోధక శక్తి పెద్దవాళ్లకన్నా తక్కువగా ఉంటుందని గుర్తించాలి. అలాగే పెద్దవారు ఏం తింటే అవి పిల్లలకు పెట్టడం సరికాదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ పెద్దవారిలా ఉండదు. అందుకే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి వారికి ఇచ్చినప్పుడు వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటప్పుడు వేపుళ్ళు, మసాలాలకు వారిని దూరంగా ఉంచాలి.. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ను ఇవ్వాలి.. వాంతులు అవుతూ ఉంటే వారికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాలి..
కూరగాయలను మెత్తగా ఉడికించి అన్నంలో కలిపి తినిపించాలి.. అన్ని రకాల కాయగూరలు కలిపి సూప్ లా చేసి తాగిపించిన ప్రయోజనం ఉంటుంది.. కొద్దికొద్దిగా ఆహారాన్ని ఎక్కువసార్లు ఇవ్వాలి.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.. ఈ సమయంలో వారికి ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. కూల్ డ్రింక్స్, పెరుగు వంటి వాటికి దూరం చేయాలి.