Health శ్వాసకోశ వ్యవస్థలో ఊపిరితిత్తులు ప్రధాన భాగం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అయితే కొన్ని రకాల ఇన్ ఫెక్షన్లు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఊపిరితిత్తులలో నీరు చేరే సమస్య చాలా మందిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోరాదు అంటున్నారు నిపుణులు..
ఊపిరితిత్తుల్లో నీరు చేరే వ్యాధిని పల్మనరీ ఎడెమా అంటారు. అయితే ఛాతీ మధ్యభాగంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం వల్ల ఎన్నో ఇబ్బందులకు వస్తాయి.. గుండె సమస్యలు ఉంటే.. ఊపరితిత్తులలో నీరు చేరే ప్రమాదం ఉందని స్పష్టంగా తెలుస్తుంది అలాగే ప్రక్కటెముకలు, ఛాతి కండరాలలో చీము , ఇన్ఫెక్షన్ చేరినా, చాతికి గాయాలైన ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి.. అయితే దీనికి సంబంధించి సరైన విధంగా చికిత్స తీసుకోకపోతే పెను ప్రమాదాలు తప్పవు.. అలాగే మూత్రపిండాలు, కాలేయం, పాంక్రియాస్ సమస్యలు ఉన్నా ఊపిరితిత్తులలో నీరు చేరే ప్రమాదం ఉంది.
అయితే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అనే విషయాన్ని తేలికగానే తెలుసుకోవచ్చు.. తిన్నగా పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా.. అరికాళ్ల వాపులు కనిపించినా.. త్వరగా బరువు పెరగినా.. రాత్రి ఆకస్మికంగా శ్వాస ఆడకపోవడం లక్షణాలు అన్నీ కూడా ఈ వ్యాధి కిందకే వస్తాయి.. ఇందుకు గాను ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి