డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర, మంచి సినిమాల ఎంపికలో పేరుపొందిన స్వాతి రెడ్డి ‘మంత్ ఆఫ్ మధు’లో కలిసి నటిస్తున్నారు. గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘మంత్ ఆఫ్ మధు’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక యూనిక్ రిలేషన్ షిప్ డ్రామా. నవీన్ చంద్ర, స్వాతిల ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో నవీన్ చంద్ర, స్వాతి అందంగా కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్ ఆఫ్ మధు’ లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. మనకు చిన్నప్పుటి నుంచి ఎదో చెప్తారు, ఎదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ డిఫరెంట్ గా వుంటుంది. ఈ సినిమాలో చూపించిన నిజం ధైర్యం ఇచ్చేలా వుంటుంది. ఈ మా సినిమాలో వున్నా నిజాయితీ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను. దర్శకుడే ఈ కథ రాశారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు. అలాగే బాధ పడే సినిమా కూడా కాదు. ధైర్యం ఇచ్చే సినిమా. అక్టోబర్ 6న మీ ముందుకు వస్తోంది. నవీన్ తో పాటు అందరికీ థాంక్స్. నన్ను గుర్తుపెట్టుకొని ఇంత ప్రేమ ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.