Movie తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం ఇండియన్ 2.. అయితే ఈ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ శంకర్ కొద్ది రోజుల క్రితం అధికార ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ టు, ఆర్ సి 15 చిత్రాలు రెండింటిని ఒకేసారి చిత్రీకరిస్తానని తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బంధం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. కమలహాసన్ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో పోషించనుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మూడో వారంలో మొదలుకానుందని శంకర్ తెలిపారు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలా కారణాలతో ఇంతవరకు ఆగిపోయింది. 2017లో ఈ సినిమా షూటింగ్ ను ప్రకటించిన దాదాపు రెండేళ్ల తర్వాత ప్రారంభమైంది అయితే 2020 మొదట్లో షూటింగ్ సెట్లో జరిగిన ఒక క్రేన్ ప్రమాదం వల్ల సినిమా ఆగిపోయింది. తర్వాత కరోనా కారణాలతో ఇన్ని రోజులు సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో 1996 లో వచ్చినా భారతీయుడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతుందే ఇండియా 2. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే ఒక సూపర్ హిట్ అని ప్రేక్షకుల నమ్మకం అయితే ఈ సినిమా కోసం ఇటు కమల్ అభిమానులు అటు శంకర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

























