Crimeభారత్కు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన దగ్గు సిరప్ వాడిన 66 మంది చిన్నారులు చనిపోయారు ఈ విషాద సంఘటన గాంబియా రాష్ట్రం దేశంలో చోటు చేసుకుంది ఈ విషయాన్ని స్వయంగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది..
భారత్కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల దగ్గు సిరప్ ల వలన గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు చనిపోయారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.. కాకుండా పెట్టిన వినియోగించిన చిన్నారుల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వచ్చాయని అవి పని చేయడం మానేశాయని హెచ్చరించింది.. ఈ సిరప్ లో వాడకంపై భారత్ తో పాటు ఇతర రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేసింది డబ్ల్యూహెచ్ఓ అయితే ఈ విషయంపై స్పందించిన భారత ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది..
ఆఫ్రికా దేశం గాంబియాలో ఇంత మంది చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన కంపెనీ ఉత్పత్తి చేసిన సిరప్‌ల కారణంగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై విచారణ ప్రారంభించిందని తెలిపారు. కాగా ఢిల్లీ శివార్లలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో ఈ సిరప్‌లు తయారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup ఈ నాలుగు సిరప్‌ల వాడకంపై హెచ్చరికలు జారీ చేసినడబ్ల్యూహెచ్‌ఓ.. వీటి నాణ్యత, భద్రతకు సంబంధించి ఆ కంపెనీ ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌ఓకు ఎలాంటి హామీ ఇవ్వలేదని టెడ్రోస్ అదనోమ్ తెలిపారు.